తక్కువ ధరలకే ప్రైవేటు వ్యాపారులకు మిల్లులకు అమ్ముకుంటున్న రైతులు
ఇల్లంతకుంట మండలంలోని వివిధ గ్రామాలలో ఏర్పాటుచేసిన ప్రభుత్వ వడ్ల కొనుగోలు కేంద్రాలలో రైతులు ధాన్యం ఆరబోసి తేమ శాతం కోసం ఎదురుచూస్తున్నారు. 17 శాతం కన్నా తక్కువ తేమ ఉంటేనే సెంటర్లలో వరి ధాన్యం కొనుగోలు చేస్తారు. దాంతో రైతులు సెంటర్లలో తమ వరి ధాన్యాన్ని ఆరబోసి తేమశాతం రావడం కోసం గాను వడ్లను ఎండకు అటు ఇటు నేర్పుతున్నారు. తొందరపాటు రైతులు మాత్రం ఈ రిస్కాంత ఏందీలే అనుకొని కోసిన పరిధాన్యాన్ని వెంటనే ట్రాక్టర్లలో ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఉన్న రైస్ మిల్లులకు తరలిస్తూ ఉన్నారు. మిల్లులో వడ్లకు క్వింటాలుకు 1900 చొప్పున చెల్లిస్తున్నారని రైతులు తెలుపుతున్నారు. గ్రామాలలోకి వరికల్లాల వద్దకు లారీలు ప్రైవేటు వ్యాపారులు తీసుకొచ్చి కొనుక్కుపోతున్నారు. ప్రైవేట్ వ్యాపారులు రైతులకు క్వింటాలుకు 1830 చెల్లిస్తున్నారని రైతులు తెలుపుతున్నారు. మండలంలోని చిక్కుడువానిపల్లి, రంగంపేట, గొల్లపల్లి, రామాజీపేట, తెలుగువారి పల్లె గ్రామాలలో డీసీఎంఎస్ వడ్ల కొనుగోలు చేస్తుందని ఇంచార్జ్ కడగండ్ల తిరుపతి తెలిపారు. ఇల్లంతకుంట ఫాక్స్ పరిధిలో 20 వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అదేవిధంగా గాలి పెళ్లి ఫాక్స్ పరిధిలో 5 వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలో సాధారణ రకానికి 2183 రూపాయలు, మేలిమి రకానికి 2203 రూపాయలు చెల్లిస్తున్నారు. వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని చల్లని గాలులు వీస్తున్నందున కొనుగోలు సెంటర్లలో వడ్లు ఆరబోసిన రైతులు వర్షాలు పడతాయేమోనని ఆందోళన చెందుతున్నారు.