Sunday, September 8, 2024
spot_img
HomeTELANGANAకరప్షన్ పోవాలంటే…కామన్ మ్యాన్ మారాలి: మహమ్మద్ అంకూస్

కరప్షన్ పోవాలంటే…కామన్ మ్యాన్ మారాలి: మహమ్మద్ అంకూస్

నేటి సమాజ పరిస్థితి ఎలా తయారయింది అంటే..! మనం మారద్దు కానీ మార్పు రావాలి, అవినీతి లేని సమాజం కావాలి, ప్రభుత్వాల ద్వారా ఉచితాలు రావాలి, మనం ఏం పని చేయొద్దు, మన ఇంటి వద్దకే అన్ని రావాలి, కానీ ఓటు వేసేటప్పుడు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే మా ఓటు… మరి డబ్బులు తీసుకొని ఓటు వేసినప్పుడు మనం కోరుకునే అవినీతి రహిత సమాజం ఎలా ఏర్పడుతుంది. ఎవరో రావాలి ఏదో చేయాలి అంటే అంటే ఏది రాదు ఈ దేశ పౌరుడిగా మన బాధ్యత ఏంటిది అనేది మనం గుర్తించినప్పుడు దేశంలో జరుగుతున్న అవినీతిని అక్రమాలను ప్రశ్నించే అధికారం మనకు ఉంటుంది. నేటి రాజకీయాలు ఎలా తయారయ్యాయి అంటే సామాన్యుడు రాజకీయం చేసే పరిస్థితి లేకుండా పోయింది. మీటింగులు పెట్టాలన్న డబ్బే, కటౌట్లు కట్టాలన్న డబ్బే, ప్రచారం చేయాలన్న డబ్బే, పది మందిని పోగు చేసి పోటీ చేసే వ్యక్తి తను చేసే పనుల గురించి చెప్పాలన్న డబ్బు ఇచ్చి పిలిపించుకొని మరి చెప్పాల్సిన పరిస్థితి తయారయింది. ప్రతి అడుగులో డబ్బు లేనిది రాజకీయాలు చేసే పరిస్థితి లేదు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 100 కోట్లు, ఎంపీగా పోటీ చేస్తే 500 కోట్లు ఖర్చు చేసే స్థితికి రాజకీయాలు చేరుకున్నాయి, మరి అన్ని డబ్బులు పెట్టి ఖర్చు చేసి గెలిచినటువంటి వ్యక్తి తాను ఎటువంటి స్వార్థం లేకుండా మనకు ఎలా పని చేయగలుగుతాడు అనే విషయాన్ని సామాన్యుడు గమనించినట్లయితే మనం ఆ నాయకుడిని ప్రశ్నించే హక్కును కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.

కాబట్టి ప్రజలారా అవినీతి రహిత సమాజం నిర్మించాలంటే, ఆర్థిక సమానత్వం కలిగిన సమాజం ఏర్పడాలంటే, ముందుగా మారాల్సింది మనమే కామన్ మ్యాన్ మారందే కరప్షన్ పోదు అనే విషయాన్ని గమనించాలి. కామన్ మ్యాన్ ముందుగా ఓటుకు నోటు తీసుకోకుండా భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకున్నట్లయితే ప్రశ్నించే హక్కు అతనికి ఉన్నట్టుగా లెక్క, నేటి సమాజంలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఓటుకు నోటు తీసుకోకుండా వేయలేనటువంటి పరిస్థితి దాపురించింది, విద్యావంతులు, ఉద్యోగులు, కోటీశ్వరులు ఓటుకు ఎంత డబ్బులు ఇస్తారు అని అడిగే అటువంటి పరిస్థితి నేటి సమాజంలో తయారయింది. మరికొన్ని విచిత్రాలు చూసినట్లయితే కొన్ని ఎలక్షన్లలో మాకు ఓటుకు డబ్బులు ఇయ్యాలి అని రోడ్డు ఎక్కి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది.ఈ దుస్థితిని చూసి సమాజంలో ఉన్నటువంటి విజ్ఞానవంతులు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. కాబట్టి ప్రజలారా, మేధావులారా, విద్యావంతులారా, ఉద్యోగులారా మన వంతుగా సమాజాన్ని చైతన్యం చేసి ఈ ఓటుకు నోటు అనేటువంటి దానిని సమాజం నుంచి తరిమి వేసినట్లయితే అవినీతి రహిత సమాజం ఏర్పడుతది అనేటువంటి విషయాన్ని గమనించాలి. అందుకే కరప్షన్ పోవాలంటే కామన్ మ్యాన్ మారాలి అని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. సీనియర్ జర్నలిస్ట్. మహమ్మద్ అంకుస్ ఒక ప్రకటనలో కోరారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments