జమ్మికుంట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనికిమాలిన రాజకీయ ఉపన్యాసం చేశారనీ, రిజర్వేషన్ల అంశంపై అవాస్తవాలను ప్రచారం చేయడానికి సీఎం బ్రాండ్ అంబాసిడర్ గా మారారని బిజెపి జిల్లా అధ్యక్షుడి గంగాడి కృష్ణారెడ్డి విమర్శించారు. జమ్మికుంటలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులాలను రెచ్చగొడుతున్నాడనీ, రిజర్వేషన్ల అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏం మాట్లాడారు, వాస్తవమేందో ఆ వాస్తవమైందో తెలుసుకోలేని స్థితిలో ముఖ్యమంత్రి ఉండడం దురదృష్టకరమన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన మార్ఫింగ్ ఆడియో వీడియో ను పట్టుకొని సీఎం వేలాడుతున్నారన్నారనీ, ఈ తప్పుడు ప్రచారంలో ఆయన భాగస్వామ్యం అయినందుకే ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారనీ తెలిపారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి స్వార్థ రాజకీయాల కోసం బిజెపి పై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడం చేత కాక కాంగ్రెస్ ప్రభుత్వం పనికిమాలిన రాజకీయాలను చేస్తుందనీ, ముఖ్యంగా జరగబోయే ఎన్నికల కోసం ప్రజలను తప్పుదారి పట్టించడానికి మార్గాలను వెతుక్కుంటుందన్నారు. 60 ఏళ్ళు కాంగ్రెస్ చేసిన పనికిమాలిన రాజకీయాలతోనే దేశం సర్వనాశనమైందనీ, తన గోతి తానే తవ్వుకుందనీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ ను తిరస్కరించే పరిస్థితి తెచ్చుకుందన్నారు. ప్రధానంగా ఇందిరాగాంధీ కాలంలో ఎమర్జెన్సీ ని విధించి రాజ్యాంగానికి తూట్లు పొడిచిన చరిత్ర కాంగ్రెస్ ఉందని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడగొట్టిన చరిత్ర కాంగ్రెస్ కే ఉందన్నారు. మతపరమైన రిజర్వేషన్లపై బిజెపి మాట్లాడితే దాన్ని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని బిజెపి గౌరవిస్తుందని, అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను గుర్తుంచుకొని బిజెపి మోదీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ను గుండు అర గుండు అని వ్యాఖ్యానించడం ఆయన సంస్కారానికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారని, ఎన్నికల సందర్భంగా రైతుల రుణమాఫీ విషయంలో చెప్పిందొకటి నేడు జరుగుతుంది మరొక్కటి. వంద రోజుల్లో అమలు చేయని వాళ్ళు ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తామని రైతాంగాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారనీ, ఎన్నికల తర్వాత రైతు రుణమాఫీ ఎగనామం పెట్టే పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉందన్నారు. నాడు బిఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామంటే కాంగ్రెస్ పార్టీయే అడ్డుకుందన్నారు. ప్రస్తుతం తాలు,తరుగు, తేమ .పేరిట వడ్ల కొనుగోళ్లలో రైతాంగాన్ని కాంగ్రెస్ దోచుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, హుజురాబాద్ నియోజకవర్గం ప్రబారి పెసరు విజయచందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, హుజురాబాద్ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి, జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కోరే రవీందర్, జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి ఠాగూర్ రాజేష్, జడల శ్రీనివాస్, పల్లపు రవి, కొమ్ము అశోక్,కైలాసకోటి గణేష్, పరిపాటి కొండల్ రెడ్డి,తుర్పాటి రాజు,తదితరులు పాల్గొన్నారు.