రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదినం సందర్భంగా బుధవారం డే కేర్ సెంటర్లో వృద్ధులకు దుప్పట్లు, బ్యాగులను మాజీ జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, మాజీ ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, డైరెక్టర్ నేవూరి వెంకట నరసింహారెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు అందే సుభాష్, నమిలికొండ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ ఎనగందుల అనసూయ నర్సింలు, పట్టణ అధ్యక్షులు ఎడ్ల సందీప్, పందిర్ల పరుశురాం గౌడ్, యూత్ అధ్యక్షులు ఎడ్ల లక్ష్మణ్, చందనం శివరామకృష్ణ, బాధ రమేష్ తదితరులు పాల్గొన్నారు.