Sunday, November 3, 2024
spot_img
HomeTELANGANAసబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

సబ్బండ వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కొనరావుపేట మండలం రామన్నపేట గ్రామంలో ప్రభుత్వ విప్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా రామన్నపేట మాజీ ఉప సర్పంచ్ ఎర్ర దేవరాజ్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి ప్రభుత్వ విప్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో మీ ముందుకు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని వచ్చానని మీరు నాపై నమ్మకం ఉంచి నన్ను వేములవాడ ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీకు ఎల్లవేళలా రుణపడి ఉంటాను అన్నారు. గతంలో చెప్పినట్టుగానే మీ ఇంటి బిడ్డగా మీలో ఒకడిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గత పాలకులు ఎమ్మెల్యే పదవిని తమ హోదాకు శిక్షణగా వాడుకున్నారే తప్ప ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకునే పాపన పోలేదన్నారు. గత పది సంవత్సరాల నియంతృత్వ పరిపాలనకు చరమ గీతం పాడుతూ ప్రజా ప్రభుత్వ ఏర్పాటులో తోడ్పాటును అందించిన వేములవాడ నియోజకవర్గ ప్రజలతో పాటు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

2014 సంవత్సరంలో సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ గా ఉండేదని కానీ రాష్ట్రాన్ని నేడు అప్పుల కుప్పగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. నేడు 6 లక్షల 71 వేల కోట్ల రూపాయల అప్పు చేసారని, దానికి మనం బ్యాంక్ లకు ప్రతి ఏటా 70 వేల కోట్ల వడ్డీ చెల్లిస్తున్నామన్నారు. రాష్టాన్ని అప్పుల కుప్పగా మార్చి తెలంగాణ ప్రజల నెత్తిన పెనుభారం మోపారని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన వారు మన ప్రాంతాన్ని ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదని, కోనరావుపేట మండల పరిధిలోని రోడ్ల, బ్రిడ్జిల నిర్మాణాలు అలాగే ఉంచారని కోనరావుపేట మండల పరిధిలోని, రామన్నపేట లింకు రోడ్ల నిర్మాణాలు బ్రిడ్జిల నిర్మాణాలని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.

మొన్నటి రోజు కేటీఆర్ తంగళ్ళపల్లిలో మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందని అంటున్నారని, ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం చలికాలంలో ఏర్పడిందని, వేసవికాలం అయిపోయి వర్షాకాలంలో వర్షాలు పడకుంటే కరువు వచ్చిందంటే ఒక అర్థం ఉంటుంది కానీ ఇప్పుడు వర్షాలు పడడం లేదని వాళ్ళు చేస్తున్న వాదనలో నిజం లేదన్నారు. వాళ్ళ మాటలు చూస్తుంటే బావా బామ్మర్దులు కలిసి రాష్ట్రంలో కృత్రిమ కరువు సృష్టించాలని కంకణం కట్టుకున్నారని అనిపిస్తుందని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వలన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారన్నారు. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని తెలంగాణ రాష్ట్రం రాక ముందు ఉన్న సిలిండర్ ధర 10 సంవత్సరాల తర్వాత 500 కే గ్యాస్ సిలిండర్ అందించడం కాంగ్రెస్ ప్రభుత్వ గొప్పతనం అన్నారు. ప్రజలకు ఉపయోగపడేలా రాష్ట్రంలో మహిళా మణులకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు, ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షుడు జెగన్ రెడ్డి, మండల అధ్యక్షుడు పాషా, మండల యూత్ అధ్యక్షుడు రవీందర్, నాయకులు నాగిరెడ్డి, గంగాధర్, దేవరాజు, తాళ్లపల్లి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments