తెలంగాణ రాష్ట్ర రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇస్తానని నమ్మ బలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని అదేవిధంగా క్వింటాల్కు 500 బోనస్ ఇస్తానని మాయ మాటలు చెప్పి గద్దెనెక్కి 100 రోజులు దాటిన ఎందుకు నెరవేర్చలేదని బీఆర్ఎస్ జిల్లా సీనియర్ ఉద్యమకారుడు అందే సుభాష్ ఘాటుగా ప్రశ్నించారు. ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి ఆఫీసులో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలో లేకున్నా తమ పక్షం రైతుల పక్షమని రైతుల గురించి పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు నెరవేర్చే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. తమ ప్రభుత్వం గతంలో రైతాంగానికి చేసిన పనులు రైతాంగానికి వివరిస్తామని ఇప్పుడున్న ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రజల ముందుకు తీసుకువెళ్తామన్నారు. రైతుబంధు రూపంలో ఎరువులకు, విత్తనాలకు, రైతులకు ఆర్థిక సహాయం చేసిన ఘనత కెసిఆర్ ప్రభుత్వందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎకరానికి పదివేలు ఇస్తామని నమ్మబలికి ఇప్పటివరకు రైతుబంధు ఇవ్వలేదని ఎద్దేవ చేశారు. మోసపూరిత వ్యాఖ్యలు చేసి గద్దెనెక్కిన సర్కారు పదివేలు ఇప్పటివరకు ఇవ్వలేదని అన్నారు. రైతుల కొరకు ఉచిత కరెంటు ఇచ్చి ఎర్రటి ఎండల్లో అప్పర్ మానేరుకు నిర్బంధించిన ఘనత కేసీఆర్ ది కాదా? అని సూటిగా ప్రశ్నించారు. రైతుల తపనే కెసిఆర్ తపన అని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిరిసిల్ల నుండి అప్పర్ మానేరు వరకు 11 చెక్ డ్యాములు కట్టిన ఘనత కెసిఆర్ ది అని కొనియాడారు. ఆనాడు రైతులకు నీళ్ళిచ్చి,పెట్టుబడి ఇచ్చి, రైతుల ఖాతాల్లో డబ్బులు వేసిన ఘనత కేసిఆర్ ది అని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నీటి మూటలు అని విమర్శించారు. డబ్బు మూటలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీకి అప్పజెపుతున్నారని తీవ్రంగా ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చందమామను చూపించి చేతిలో పెడతామని ఆశ చెప్పారని ఎద్దేవ చేశారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామన్నారు, రైతు బీమా ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి పార్లమెంటు స్థానానికి నిలబడ్డ వినోద్ కుమార్ కు ఓట్లు వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు తమ బీఆర్ఎస్ పార్టీ తరఫున కోట్లాడుతామని ఎక్కడికక్కడ ఎండగట్టి హామీలు నెరవేర్చే వరకు వెంటపడతామని హెచ్చరించారు. ఆనాటి ప్రభుత్వానికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏంది అనేది ప్రజలందరూ గుర్తించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, మండల అధ్యక్షులు, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, మండల కో ఆప్షన్ మెంబెర్ జబ్బర్, సీనియర్ నాయకులు మీసం రాజం, పందిర్ల పరుశురామ్ గౌడ్, బంధారపు బాల్రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు ఎడ్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.