సిద్దిపేట జిల్లా దూలమెట్ల మండలం మద్దూరు కొండాపూర్ గ్రామస్థుడు ఇస్లాము భాస్కర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రామిరెడ్డిపల్లి గ్రామంలో 24వ తేదీ మార్చి 2024 రోజున ఉదయం 5 గంటలకు ఎలాంటి అనుమతి లేకుండా మానేరు వాగు నుండి తన టిప్పర్ టీఎస్ 12 UC 4693 లో దొంగతనంగా ఇసుక రవాణా చేస్తుండగా పట్టుకొని నేరస్తుని సిరిసిల్ల న్యాయమూర్తి ముందు హాజరు పరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ పంపినారని ఇక ముందర అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముస్తాబాద్ ఎస్సై శేఖర్ రెడ్డి మీడియా ముఖంగా తెలిపారు