రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్ లోని ఉన్న ఐలమ్మ విగ్రహానికి మంగళవారం వివిధ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వర్ధంతి వేడుకలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, బిజెపి సీనియర్ నాయకులు కంచర్ల పరుశరామ్, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, మాజీ జెడ్పిటిసి ఏలూరు రాజయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సూడిద రాజేందర్, కొమిరిశెట్టి తిరుపతి, షేక్ గౌస్, బండారి బాల్రెడ్డి, పిల్లి కిషన్, బాధ రమేష్, మెండె శ్రీను తదితరులు పాల్గొన్నారు.