జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనిలో ఏర్పాటు చేసిన వినాయకుడిని బిజెపి నాయకులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు గణనాథుడిని ఎంతో భక్తిశ్రద్ధలతో భక్తులు పూజిస్తారని కోరిన కోర్కెలు తీర్చే దేవుడు గణనాధుడని, అలాంటి దేవుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. గణనాధుని కృపతో పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజల్లో భక్తి భావం, ఐక్యమత్యం, స్నేహభావం పెంపొందించడానికి ఇలాంటి ఉత్సవాలు ఎంతో దోహదపడతాయని కులాల కతీతంగా, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ భక్తి భావంతో గణనాధుని ఉత్సవాలు జరుపుకోవాలని సంపత్ రావు పిలుపునిచ్చారు. గణనాధుని ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న హౌసింగ్ బోర్డ్ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీని బీజేపీ నాయకులు అభినందించారు. సంపత్ రావు వెంట బిజెపి జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి పల్లపు రవి, మోతే స్వామి, కార్యదర్శి మోడం రాజు, తూడి రవిచందర్, రెడ్డి,వేముల జగన్, కొలను సంతోష్ రెడ్డి, మోతే అర్జున్, తదితరులు పాల్గొన్నారు..