Saturday, October 5, 2024
spot_img
HomeTELANGANADEO, విద్యాశాఖ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ABVP నాయకులు

DEO, విద్యాశాఖ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ABVP నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కార్పోరేటు ప్రవేట్ విద్యాసంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడిని, అక్రమంగా బుక్స్, డ్రెస్ లు అమ్మడం యథేచ్ఛగా నడుస్తున్న చూసి చూడనట్టు వ్యవహారిస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారులపైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఏబీవీపీ నాయకులు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలో ఈ విషయాలపైన డి ఈ ఓ కు ఫిర్యాదు చేశామని తాము స్వయంగా నారాయణ కార్పొరేట్ పాఠశాలల్లో బుక్స్, డ్రెస్ లు అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని మరి విద్యాశాఖ అధికారి కంటికి ఇలాంటివి కనబడటం లేదా అంటూ ప్రశ్నించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు (యూనిఫామ్ ల), ఇతర మెటీరియల్ ను ఎక్కువ ముత్తానికి విద్యార్ధులకు అమ్ముతున్నారని దాదాపు రూ.1,000 విలువ చేసే ఒకటవ తరగతి పాఠ్యపుస్తకాలను రూ.6 నుండి రూ.8 వేల రూపాయలు వరకు పెంచి అమ్ముతున్నారని ఈ విధంగా చూసుకుంటే విద్య వ్యవస్థను వ్యాపారాన్ని చేస్తూ రూ. లక్షల్లో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నారన్నారు.

విద్యా సంవత్సర ఫీజులను సైత ఇష్టానుసారంగా నిర్ణయించి, అడ్మిషను ఫీజు, సెమిస్టర్ ఫీజు, పరీక్ష ఫీజు, అసైన్మెంటు ఫీజు, స్టేషనరి ఫీజు, బస్ ఫీజు, లేట్ ఫీజు, అబ్సెంట్ ఫీజు అంటూ వివిధ రకాల పేర్లు పెట్టి విద్యార్థులను ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నారని ఒక ఏడాదికి సంబందించిన పాఠశాల ఖర్చులను ఇలాంటి ఫీజులు, పాఠ్యపుస్తకాల అమ్మకం మీదనే పోగు చేసుకుంటున్నారని తెలిపారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పాఠ్యపుస్తకాలను అమ్ముతూ, విద్యార్థుల తల్లిదండ్రులను అడ్మిషన్ ఫీజు పేరుతో లేకపోతే పాఠశాల సగం ఫీజు ఇప్పుడే చెల్లించాలి అని వేదిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల జీవితాలతో చెలగాటం ఆడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారమన్నారు.

1994 సంవత్సరంలో ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో 1 ప్రకారం ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యాసంస్థలు పనిచేయాలని చెప్తున్న వాటిని ఏ కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు పాటించకుండా ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ ధనార్జనే ధ్యేయంగా డొనేషన్లు, స్పెషల్ ఫీజులు, బస్సు ఫీజు, యూనిఫామ్ ఫీజు, బుక్స్ ఫీజ్ అని వివిధ రకాల పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులను మానసికంగానూ వేధిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని 2009 లో వచ్చిన జీవో నెంబర్ 91 ప్రకారం కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు టెక్నో, ఈ టెక్నో, డిజి, టాలెంట్, ఒలింపియాడ్ అనే బ్రాండ్ పేరుతో పాఠశాల వద్ద పాఠ్యపుస్తకాలను అమ్మొద్దని ఉన్నా కూడా కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు పట్టించుకోవడంలేదని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు, స్పందించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు గుర్తింపును రద్దుచేసి వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్, ఏబీవీపీ వింగ్ sfd విభాగ్ కన్వీనర్ సమానపల్లి ప్రశాంత్, sfd జిల్లా కన్వీనర్ లోపెల్లి రాజు, ఖేల్ కన్వీనర్ ఎలాగందుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments