రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ఈ రోజు ప్రారంభమైన నేపథ్యంలో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్ గారు ఆసిఫాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత బాలికల పాఠశాల పరీక్ష కేంద్రాన్ని పరిశీలించి పరీక్ష కేంద్ర అధికారులు మరియు సిబ్బందికి తగు జాగ్రత్తలు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత పరీక్షల పర్యవేక్షణ అధికారికి, పోలీస్ అధికారులకు సూచించారు. జిల్లావ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు పటిష్టంగా ఉన్నట్లు, 144 సెక్షన్ అమలు లో ఉందని అన్నారు.