Monday, October 7, 2024
spot_img
HomeTELANGANAరాహుల్ గాంధీని తీవ్రవాదిగా చిత్రీకరించడం హేయనీయం

రాహుల్ గాంధీని తీవ్రవాదిగా చిత్రీకరించడం హేయనీయం

లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పై ఈగ వాలిన ఊరుకోమని టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. బుధవారం హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు. బిజెపి పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ ని తీవ్రవాదిగా చిత్రీకరిస్తూ మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు. హుజురాబాద్ లో కూడా రాహుల్ గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు పెట్టాలని నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ కు సూచించారు. గాంధీ కుటుంబంలో పుట్టిన వ్యక్తి రాహుల్ గాంధీ, నెహ్రూ వేసిన బాటలో నేడు దేశం అభివృద్ధిలో ముందుకు పోతుందని అన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ వచ్చింది అని బీజేపీకి అక్కసు ఉందన్నారు. తీవ్రవాదుల చేతుల్లో కుటుంబాన్ని కోల్పోయిన వ్యక్తి రాహుల్ గాంధీ అని అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రధాని ఏందుకు స్పందించడం లేదు. గాడ్సే విధానాన్ని మోడీ పాటిస్తున్నారని బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. రాహుల్ గాంధీ మీద ఈగ వాలిన ఊరుకునేది లేదు. మతాన్ని అడ్డుపెట్టుకొని మోడీ ప్రధాని అయ్యారని అన్నారు. యావత్ భారతదేశం ఇప్పుడు రాహుల్ గాంధీ వైపు చూస్తుందని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ దేశం లో అధికారంలోకి వస్తుందన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న బిజెపికి 100 సీట్లు కూడా రావని ఆయన అన్నారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్, హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్తి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సొల్లు బాబు, మండల అధ్యక్షుడు కొల్లూరు కిరణ్, పట్టణ మహిళా అధ్యక్షురాలు వేముల పుష్పలత, మండల అధ్యక్షురాలు లంక దాసరి లావణ్య, తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments