తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బోనాల ఉత్సవాలను ఆల్ఫోర్స్ జీనియస్ స్కూల్ హుజూరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల్ఫోర్స్ స్కూల్స్ చైర్మన్ డా.వి.నరేందర్ రెడ్డి పాల్గోని బోనాల ప్రత్యేకతను విద్యార్ధులకు తెలియజేసారు. ఆషాడమాసంలో బోనాల ఉత్సవాలను జరుపుకుంటారు. భోనం అనగా భోజనం అని అర్ధం. ఆషాడ మాసంలో అమ్మవారు తమ పుట్టింటికి వెళతారు. అమ్మవారిని భోనంతో ఎదుర్కొని ఓడి బియ్యం, చీరే, సారెలను అమ్మ వారికి అందించి పూజిస్తారు. విద్యార్థులు చదువుతో పాటుగా తమ సంస్కృతి ఆచార సంప్రదాయాలను గురించి తెలుసుకోవాలని చైర్మన్ విద్యార్థులకు సందేశం అందించారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు రెడ్ డే వేడుకల్లో పాల్గొని చిన్నారులు అద్భుత ప్రసంగం చేశారు. నిన్న జరిగిన హౌజు ఎలక్స్షన్స్ విజేతలకు బహుమానాలు అందించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ డా.వి.నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.