ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి, సింగారం, గొల్లపల్లి గ్రామాలకు చెందిన ఐదుగురిని 15 రోజులలో గల్ఫ్ పంపిస్తానని గల్ఫ్ ఏజెంట్ మోసం చేయగా బాదితులు లబోదిబోమంటున్నారు. ముంబాయి లో వాకల ఫర్ ముంబాయి క్లాసిక్ ఇంటర్ నేషనల్ అయోషా కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వీసా ఇమిగ్రేషన్ ఎయిర్ టికెటింగ్ సర్వీస్ సౌకర్యం ఉందని దానికి మేనేజింగ్ డైరెక్టర్ గా మొహమ్మద్ అక్తర్ వ్వవహారిస్తూ యువకులను విదేశాలకు పంపిస్తానని ఒక్కొక్కరి వద్ద రూ.80వేల చొప్పున సుమారు రూ.4 లక్షల రూపాయలు తమ వద్ద వసూలు చేశాడని రెండు నెలలు కావస్తున్న ఇంతవరకు తమను పంపించలేదని 9987980547, 9820260547 సెల్ ఫోన్ నెంబర్లకు పోన్ చేస్తే అక్తర్ పోన్ ఎత్తడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. నిరుపేదలమైన తాము నూటికి నెలకు మూడు రూపాయల వడ్డీ చొప్పున తెలిసిన వారి దగ్గర అప్పు చేశామన్నారు, బ్రతుకు దెరువు కోసమని గల్ఫ్ వెళ్లి అక్కడ పనిచేసి తీర్చుకుందామని అప్పులు చేశామన్నారు. ఎజెంట్ వీసాలు పంపి గల్ఫ్ పంపుతాడని అనుకుంటే 15 రోజుల క్రితం తమ పాస్ పోర్ట్ లను కొరియర్ ద్వారా పంపినాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమను మోసం చేసిన అక్తర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని అతని నుండి తమ వద్ద వసూలు చేసిన 4 లక్షల రూపాయలు ఇప్పించాలని బాధితులు సింగారం గ్రామానికి చెందిన షేక్ రషీద్, బండ లింగంపల్లి గ్రామానికి చెందిన ముఫీద్, షేక్ ఆసీఫ్, ఇర్ఫాన్, గొల్లపల్లి కి చెందిన షేక్ సయ్యద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను కోరుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని తమకు 15 రోజుల్లో వీసాలు వస్తున్నాయని చెప్పి నమ్మబలికి ఆరోగ్య పరీక్షలు చేయించి మోసం చేసిన ఎజెంట్ ఆక్తర్ పై జిల్లా ఎస్పీ కి సోమవారం జరిగే ప్రజాదీవాస్ లో పిర్యాదు చేస్తామన్నారు,