Monday, May 20, 2024
spot_img
HomeTELANGANAదళితుల భూమి కబ్జా చేసిన MPP డుబ్బుల నానయ్య

దళితుల భూమి కబ్జా చేసిన MPP డుబ్బుల నానయ్య

కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండల కేంద్రంలోని బాలాజీ అనుకోడ శివారులో కాంబ్రే శంకరయ్య కామ్రే పాపయ్య తమ భూమి ఎంపీపీ డుబ్బుల నానయ్య కబ్జా చేసి తమ కుటుంబాన్ని తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని తమకు ప్రాణహాని ఉన్నదని మీడియా ముందు ఆరోపించారు. కామ్రే శంకరయ్యకు 65/348 సర్వే నెంబర్ లో ఐదు ఎకరాల భూమి, కామ్రే పాపయ్య కు 65/270 సర్వే నెంబర్ లో 5 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి వీరికి కామ్రే భూమక్కా నుంచి వారసత్వంగా వచ్చింది. ఇందులో తనకు ఒక ఎకరం 28 గుంటలు భూమి ఉన్నదని నకిలీ పత్రాలు సృష్టించి మండల తాసిల్దార్ అండదండలతో ఫామ్ 7 తారుమారు చెసి MPP డుబ్బుల నానయ్య తమ భూమిని కబ్జా చేసుకోని భయపెడుతున్నారని బాధితులు మీడియా ముందు కన్నిటిపర్యంతం అయ్యారు. ఎంపీపీ డుబ్బుల నానయ్య తాసిల్దార్ సాయంతో రికార్డులలో కామ్రే పాపయ్య తండ్రి బక్కోడు బక్కాయ్య బదులుగా కామ్రే ప్రేమ్ కుమార్ తండ్రి బక్కయ్యగా రికార్డ్ లలో తప్పుగా నమోదు చేయించి ఫోర్జరీ సంతకాలు చేసి పట్టా మార్పు చేయడానికి రెవిన్యూ ఉద్యోగులను ప్రలోభ పెట్టి పేద రైతులు కామ్రే శంకరయ్య తండ్రి పాపయ్య భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వం, అధికారులు తమకు న్యాయం చేయాలని మీడియాముఖంగా వేడుకుంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments