రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాలలో పార్టీ అధిష్టానం సూచనల మేరకు భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం నాడు బూత్ లెవెల్లో నిర్వహించారు. మండలంలోని కందికట్కూర్, వంతడుపుల, వెల్జిపురం, పొత్తూరు, నరసక్కపేట, రేపాక, తెనుగువానిపల్లె, ఇల్లంతకుంట, సోమారం పేట, తదితర గ్రామాలలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్ని ఆయా గ్రామ బూత్ లెవల్ అధ్యక్షులు నిర్వహించారు. జండా ఆవిష్కరణ అనంతరం టిఫిన్ బైఠక్ కార్యక్రమాన్ని నిర్వహించి పార్టీ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయా గ్రామాలలో పార్టీ కార్యకర్తలు చర్చించుకున్నారు. వెల్జిపురం గ్రామంలో జండా ఆవిష్కరణలో సీనియర్ నాయకుడు దేశెట్టి శ్రీనివాస్ పాల్గొని కార్యకర్తలకు తన గృహంలో టిఫిన్ బైఠక్ నిర్వహించారు. తెనుగువాని పల్లెలో పినకాసి అనిల్269 బూత్ లెవెల్ అధ్యక్షుడు జెండా ఆవిష్కరణ చేసి టిఫిన్ బైఠక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ బిజెపి మండల అధ్యక్షుడు నాగసముద్రాల సంతోష్ పాల్గొన్నారు.