రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్న శ్రీ లక్ష్మీ కేశవ పెరుమాండ్ల ఆంజనేయ స్వామి దేవస్థానం గుట్ట వద్ద దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బోరు వేసి పనులను ప్రారంభించారు. బోర్ వేయడానికి సహకరించిన ఎల్లారెడ్డిపేట ప్రజానీకానికి, భక్తులకు మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ లక్ష్మీ కేశవ పెరమండ్ల ఆంజనేయస్వామి ఆలయ కమిటీ చైర్మన్ పారిపెళ్లి రామ్ రెడ్డి శ్రీ లక్ష్మీ కేశవ పెరుమాండ్ల ఆంజనేయస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ వైస్ చైర్మన్ ముత్యాల ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పందిర్ల లింగం గౌడ్, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసన్న, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, రామ్ రెడ్డి ,శ్రీనివాస్ గౌడ్, ఎస్ కే గౌస్, గుండాడి వెంకటరెడ్డి, తిరుపతి, గౌడ్ గంట అంజయ్య ,గంట బుచ్చయ్య, కొరిమిశెట్టి తిరుపతిరెడ్డి, బీపేట రాజ్ కుమార్, లాలాబాయి, గడ్డం జితేందర్, గంట వెంకటేష్ గౌడ్, అంతేర్పుల కనకరాజు, బాయికాడి సతీష్, మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు