హిందూపురం పట్టణంలో శనివారం ఉదయం 10గంటలకు బాలాజీ మనోహర్ కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉమర్ ఫారూక్ ఖాన్ నిర్వహణలో ధనాపురం వెంకటరామిరెడ్డి. చైతన్య గంగిరెడ్డి సంయుక్త అధ్యక్షతన కామన్ సివిల్ కోడ్ కి వ్యతిరేక సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు అబ్దుల్ ఘనీ, విశిష్ట అతిథిగా కాంగ్రెస్ నాయకులు బాలాజీ మనోహర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో క్రైస్తవ పాస్టర్ల సంఘం, సిక్కు సోదరులు, దళిత సంఘాలు పాల్గొని కామన్ సివిల్ కోడ్ కు వ్యతిరేకంగా అభిప్రాయసేకరణ నిర్వహించారు.
రాజ్యాంగ స్ఫూర్తికి భారతీయ మూలాలకు భిన్న మతాలు విభిన్న సంస్కృతులను ఎస్సీ ఎస్టీ చట్టాలను రిజర్వేషన్ లను రాజ్యాంగాన్ని దేశ సుస్థిరతను జాతీయ సమైక్యతను మత సామరస్యాన్ని పరమత సహనాన్ని. సోదర భావాన్ని వసుదైక కుటుంబాన్ని విచ్చిన్నo చేసి భారత దేశాన్ని ఆస్థిరత్వం లోకి నెట్టే ఉమ్మడి పౌరాస్మృతి చట్టాన్ని వ్యతిరేకిద్దాం కుల మతాలు జాతులు వర్గాలు వర్ణాలకు అతీతంగా సంఘటిత మౌదాం అంటూ వక్తలు ప్రసంగించారు
ప్రజా సంఘాల పిలుపు మేరకు ప్రజాసంఘాలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో సమావేశం జరిపి ఉమ్మడి పౌరాస్మృతి కామన్ సివిల్ కోడ్ చట్టంపై తమ వ్యతిరేకతను రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రతి పక్షాలు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్లో వ్యతిరేక గళంతో పాటు ఈ చట్టానికి వ్యతిరేక ఓటు వేయాలని ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేస్తూ తీర్మానం చేసి సంతకాలు సేకరణ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి పక్షాలకు పంపు తున్నామని అన్నారు
కాంగ్రెస్ నాయకులు బాలాజీ మనోహర్ మాట్లాడుతూ పార్టీలు ఈ చట్టం పై తమ అభిప్రాయం బయట పెట్టాలని రాష్ట్రంలో వ్యతిరేకించి పార్లమెంట్ లో దొంగచాటుగా కామన్ సివిల్ కోడ్ కు అనుకూలంగా ఓట్లు వేసి ప్రజలకు మోసం చేసే విధానాన్ని విడిడచిపెట్టాలన్నారు వందలాది మతాలు వేలాది కులాలు సంస్కృతులు సాంప్రదాయాలను రాజ్యాంగ హక్కులను ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాల రిజర్వేషన్ లు చట్టాలను నిర్మూలన చేసి రాజ్యాంగ హక్కులు కాల రాయడానికి ముస్లిం క్రైస్తవ మైనారిటీల సంస్కృతీ సాంప్రదాయాలను నిర్మూలనకు బీజేపీ ప్రభుత్వం పన్నాగo పన్ని ఎన్నికల సమయంలో అభివృద్ధి పట్ల ప్రజలు ప్రశ్నిస్తారని ఇలాంటి పోకడలు చేస్తూ దేశంలో ఆస్థిరత్వం సృష్టించి జాతీయ సమైక్యతకు దేశ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి దేశాన్ని అంతర్యుద్దo లోకి నెట్టే ప్రయత్నం చేస్తోందని ప్రతి ఒక్కరూ కులాలు మతాలు వర్గాలు వర్ణాలు జాతులు పక్కన పెట్టి ఐకమత్యం తో దేశాన్ని కాపాడు కోవాలని పిలుపు నిచ్చారు. హిందువులు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు ప్రార్ధనలు చేస్తూ మణిపూర్ లో జరిగిమరణించిన మణిపూర్ ప్రజల కోసం ప్రార్థనలు చేశారు అనంతరం కామన్ సివిల్ కోడ్ మాకొద్దు. హిందువుల ముస్లిం ల క్రైస్తవుల సిక్కుల దళితుల బౌద్దుల ఐక్యత సోదర భావం వర్ధిల్లాలి అని నినాదాలతో సభను ముగించారు
ఈ కార్యక్రమంలో ఎం ఆర్ పీ ఎస్ నాయకులు సతీష్ కుమార్. తలహాఖాన్. ఉబెదుల్లా హుసేన్. రవూఫ్. విశ్రాంత తహసీల్దార్ రాందాస్. సీపీఐ నాయకులు వినోద్ ఇస్మాయిల్ ఆంజినేయులు. ఆనంద్. నాగార్జున. బుద్దిస్ కల్చరల్ ఇండివర్. ముస్లిం మత విద్వాంసులు మౌలానాలు ముతవల్లీలు కాంగ్రెస్ నాయకులు అమానుల్లా. జమీల్. యునుస్. తదితరులు పాల్గొన్నారు