*ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వోడితల ప్రణవ్. ప్రపంచ దేశాలలో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు అత్యంత కఠిన ఉపవాస దీక్షలతో క్రమశిక్షణతో నియమ నిబంధనలను పాటిస్తూ రంజాన్ మాసాన్ని పవిత్ర మాసంగా పరిగణిస్తూ ప్రార్థనలు చేస్తారని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ అన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని ఈద్గాల వద్ద ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకరికొకరు ఆప్యాయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ
నా చిన్నతనం నుండి ముస్లిం సోదరులు జరుపుకునే రంజాన్ పండుగను దగ్గరగా ఉండి చూస్తున్నానని, ప్రతి ముస్లిం సోదరుడు తనకు ఎన్ని కష్టాలు ఉన్న రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేసి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేయడం శుభదాయకమన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం లోని ముస్లిం సోదరులందరికీ మరొకసారి రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.