రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలం పెద్దమ్మ స్టేజి వద్ద ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చెక్ పోస్ట్ ల వద్ద నాకా బందీ చేపట్టాలని విధుల్లో ఉన్న అధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా 50 వేల రూపాయలు పైన నగదుకు సరైన పత్రాలు ఆధారాలు లేకుండా ఎవరైనా తీసుకెళ్తే వాటిని సీజ్ చేయాలన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉందని ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని కోరారు. ఈ తనిఖీల్లో తాసిల్దార్ భూపతి తదితర ఉన్నతాధికారులు ఉన్నారు