జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీతోపాటు, పిట్టల వాడ, అంబేద్కర్ కాలనీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏరియాలో 16 వ వార్డు, మోత్కులగూడెం కాలనీలో రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలతో నీట మునిగిన ఇండ్లను హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ బాబు సందర్శించారు. వారి వెంట వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్నకోటి స్థానిక కౌన్సిలర్లు సాయిని రమ రవి, శ్రీపతి నరేష్, పిట్టల శ్వేతా రమేష్, ఎలగందుల స్వరూప శ్రీహరి, దిడ్డి రాము, గుల్లి పూలమ్మ మొగిలి, బొంగోని వీరన్న, రవికంటి రాజు, పొన్నగంటి సారంగం, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్, గూడెపు సారంగపాణి తో కలిసి పలువురు వరద భాదితులు పరామర్శించారు. ఒడితల ప్రణవ్ బాబుకు వరద బాధితులు తమ సమస్యలు తెలియజేశారు.
ప్రతి సంవత్సరం వర్షాలు వచ్చాయంటే ఇంట్లోకి నీళ్లు వచ్చి వస్తువులన్నీ తడిచిపోతున్నాయని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ఎగువన ఉన్న మడిపల్లి, కొత్తపల్లి శ్రీరాములపల్లి ఏరియా నుండి వరద నీరు దిగువన ఉన్న హౌసింగ్ బోర్డ్ కాలనీలోకి వస్తున్నాయని గతంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు వచ్చి వరద కాలువ నిర్మిస్తామని హామీ ఇచ్చారు తప్ప ఇప్పటివరకు పనులను ప్రారంభించలేదని కాలనీవాసులు ప్రణవ్ కు మొరపెట్టుకున్నారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అండగా ఉంటుందని, వరద కాలువలు నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అందుబాటులో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు బాధితులకు సహాయ సహకారాలు అందించాలని అన్నారు. కార్యక్రమంలో ఎర్రబెల్లి రాజేశ్వరరావు, పుల్లూరి సదానందం, మొలుగూరి సదయ్య, పూదరి రేణుక శివకుమార్ గౌడ్, దీక్షిత్, పాతకాల అనిల్, సతీష్ రెడ్డి, అజయ్, నవీన్, శ్రీనివాస్, అయోధ్య సలీం ముద్దమల్ల రవి, చిన్నింటి నాగేందర్, పాపిరెడ్డి, దొడ్డే రాజు, దొడ్డే సదానందం, అశోక్, యూత్ కాంగ్రెస్ నాయకులు సజ్జద్ మహమ్మద్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..