ప్రజా విజయోత్సవం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వేములవాడ నియోజకవర్గంలో 679 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. 236 కోట్లతో మిడ్ మానేరు రిజర్వాయర్ భూ నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు, 166 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల పాస్టర్ బ్లాక్ నిర్మాణ పనులకు, 50 కోట్లతో వేములవాడ పట్టణంలో నూలు డిపో నిర్మాణ పనులకు, 47 కోట్ల 85 లక్షలతో మూల వాగు నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్డు విస్తరణ పనులకు, 42 కోట్లతో రుద్రంగి మండలంలో అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ నిర్మాణానికి, 3 కోట్ల 80 లక్షలతో వేములవాడ పట్టణంలో మురుగు కాల్వ పనులకు, వీర్నపల్లిలో కోటి యాబై లక్షలతో పి.హెచ్.సి నిర్మాణ పనులకు, మేడిపల్లిలో 5 కోట్లతో జూనియర్ కళాశాల నిర్మాణ పనులకు శంఖుస్థాపన, 28 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయం, వేములవాడ పట్టణంలో కోటి 45 లక్షలతో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనం, 4 కోట్ల 80 లక్షలతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ప్రారంభోత్సవాలు చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టు భూ సేకరణకు 5 కోట్ల రూపాయలు, కాళేశ్వరం ప్యాకేజీ 9 పనులకు 11 కోట్ల 79 లక్షలు విడుదల చేశారు.
వేములవాడలో 679 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
RELATED ARTICLES


