Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAబక్రీద్ పండుగకు సౌకర్యాలను కల్పించాలని కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన మహమ్మద్ తాజోద్దీన్

బక్రీద్ పండుగకు సౌకర్యాలను కల్పించాలని కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన మహమ్మద్ తాజోద్దీన్

ఈనెల 7వ తేదీ నుండి మూడు రోజుల పాటు జరుపుకునే బక్రీద్ పండుగను పురస్కరించుకొని కరీంనగర్ నగరం, జిల్లా లోని మూడు మున్సిపాలిటీలు, 14 మండలాల పరిధుల్లోని మసీద్ లు, ఈద్ గాహ్ లు, ఖబ్రస్థాన్ లను శానిటేషన్, వాటర్, కరంటు సౌకర్యాలు కల్పించాలని, పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండే విధంగా చూడాలని పశువులని ఖుర్బానీ ఇచ్చాక వాటి కళాబేరాలు తరలించడానికి ట్రాక్టర్ సౌకర్యం, పోలీస్ బందోబస్త్కల్పించాలని, పశువులను సంత నుండి తీసుకోని వచ్చేటప్పుడు చెక్ పోస్టుల వద్ద వెటర్నరీ డాక్టర్ నుండి సర్టిఫికెట్ చూపాలని కొందరు కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అలంటి వారి నుండి రక్షణ కల్పించాలని ఇతర సౌకర్యాలు కల్పించాలని కరీంనగర్ జిల్లా ముస్లిమ్ ల పక్షాన జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందించిన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ చైర్మన్ మహమ్మద్ తాజుద్దీన్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మైనారిటీ నాయకులు సమద్, నవాబ్, నేహాల్ అహ్మద్, అబ్దుల్ రహేమాన్, మహమ్మద్ కలిమోద్దీన్, ఫిరోజ్, ఆరిఫ్ ఖాన్, గౌస్ భాయ్, హనీఫ్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments