ఎల్లారెడ్డిపేటలోని రెండవ బై పాస్ రోడ్డులో ప్రమాదకరంగా విద్యుత్ తీగలు ఉన్నాయని అవి ఎప్పుడు తెగి కిందపడతాయో తెలియని పరిస్థితి ఉందని మార్నింగ్ వాకింగ్ చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నడుస్తున్నామనీ మార్నింగ్ వాకార్స్ ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ దృష్టికి తీసుకు వెళ్ళారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైరును సరిచేయాలనీ సెస్ ఏ ఈ పృథ్విథర్ దృష్టికి తీసుకు వెళ్లగా వెంటనే స్పందించిన సెస్ ఏ ఈ విద్యుత్ హెల్పర్లను ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లను సరిచేయాలనీ సంఘటన స్థలానికి పంపించారు. వైర్ల కింద చెట్లు పెట్టడం వల్ల ఇట్లాంటి పరిస్థితి తలెత్తుతుంది అని సెస్ సిబ్బంది అన్నారు. తెగిపోయే దశలో ఉన్న విద్యుత్ వైర్లను సరిచేస్తామని సెస్ ఏ ఈ పృథ్విథర్ అన్నారు. సమస్యపై స్పందించిన మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ కు మార్నింగ్ వాకర్స్ దన్యవాదాలు తెలిపారు