ముంబై: తప్పించుకు తిరుగుతున్న నేరస్థుల జాడ తెలుసుకునేందుకు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. అసెట్ డిఫాల్టర్ల సమాచారం తెలిపిన వారికి రూ.20 లక్షల వరకు నజరానా అందించనున్నట్లు ప్రకటించింది. ఈ రివార్డును రెండు దశల్లో చెల్లించనున్నట్లు తెలిపింది. తాత్కాలిక నజరానా కింద డిఫాల్టర్ అసెట్ రిజర్వ్ ధరలో 2.5 శాతం లేదా రూ.5 లక్షల్లో ఏది తక్కువైతే అది చెల్లించనుంది. తుది రివార్డు కింద రికవరీ అయిన బకాయిల్లో గరిష్ఠంగా 10 శాతం లేదా రూ.20 లక్షల్లో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని చెల్లించడం జరుగుతుందని సెబీ స్పష్టం చేసింది.