హోలీ వేడుకల్లో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో హోలీ పండగ వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే తమ తమ వాడల్లో చిన్నాపెద్ద భేదం లేకుండా చిన్నారులు, పెద్దలు, మహిళలు, యువతీ, యువకులు రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుని హోలీ పండుగలో పాల్గొన్నారు. ఉదయం నుండే ఆయా గ్రామాల్లోని వాడలు రంగులమయం అయ్యాయి.
ఎల్లారెడ్డిపేటలోని నెహ్రూ విగ్రహం వద్ద, పాత బస్టాండ్ లో, అంబేద్కర్ విగ్రహం వద్ద, గాంధీ విగ్రహం వద్ద, నంది విగ్రహం వద్ద, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదుట హోలీ సందర్భంగా ఒకరిపైనొకరు రంగులు చల్లుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు సంబరాలు జరుపుకున్నారు,
బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య , బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మటి నరసయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయ్, మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంఘం అధ్యక్షులు గంట కార్తీ గౌడ్, గొల్ల కురుమ యాదవ సంఘం అధ్యక్షులు మండే శ్రీనివాస్ యాదవ్, మున్నూరు కాపు సంఘం పట్టణ అధ్యక్షులు బాద రమేష్, కట్టేల బాబు, మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, నాయకులు గుండాడి రామ్ రెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ బీపేట రాజ్ కుమార్, ఎడ్ల సందీప్, సంతోష్ గౌడ్, కనకరాజు ప్రమోద్, ధర్మేందర్, ప్రమోద్, పర్ష రాములు గౌడ్, ద్యాగం లక్ష్మీనారాయణ, దేవేందర్, శ్రీనివాస్ గౌడ్, రామచందర్ నాయక్, నాగరాజ్ యాదవ్, బాల్ రెడ్డి, యవకులు ఒకరిపై ఒకరు రంగులు చల్లి శుభాకాంక్షలు తెలుపుకున్నారు,