రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డీపేట మండలం గొల్లపల్లి గ్రామంలో శ్రీకృష్ణ అష్టమి వేడుకలు యాదవ సంఘం ఆధ్వర్యంలో పిల్లలు పెద్దలు పాల్గొనగా ఘనంగా జరుపుకున్నారు. మొదటి బహుమతి మద్దివేణి ప్రశాంత్ కుమార్తె మద్దివేణి శ్రీ హాసిక కు వరించింది. యాదవ సంఘం అధ్యక్షులు షాగా శ్రీనివాస్, ఉపాధ్యక్షులు అలివేలు సత్తయ్య, క్యాషియర్ పెంజర్ల సత్తయ్య, సెక్రెటరీ లక్ష్మణ్, సలహాదారులు పెంజర్ల ప్రభుదాస్, షాగ మల్లేశం, మద్దివేణి లక్ష్మణ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ అష్టమి వేడుకలను ఘనంగా రాచర్ల గొల్లపల్లి బస్టాండ్ ఆవరణలోని నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్దలతో ఉట్టి కొట్టడం ప్రతి సంవత్సరము పిల్లా పాపలు చల్లగా ఉండాలని గొడ్డు గోదా చల్లగా ఉండాలని శ్రీకృష్ణుని వేడుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు.


