రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన కర్రోళ్ల రాజు 38 గురువారం అర్ధరాత్రి ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట గ్రామ శివారులో బైకు అదుపుతప్పి మృతి చెందినట్లు జిల్లా బీఎస్పీ అధ్యక్షులు వరదవెల్లి స్వామి గౌడ్ పేర్కొన్నారు. తన మృతి బహుజన సమాజ్ పార్టీకి తీరని లోటని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అదేవిధంగా తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.