Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAమైనారిటీ రెసిడెన్సియల్ స్కూల్ హాస్టల్స్ సందర్శించిన మహమ్మద్ తాజుద్దీన్

మైనారిటీ రెసిడెన్సియల్ స్కూల్ హాస్టల్స్ సందర్శించిన మహమ్మద్ తాజుద్దీన్

మైనారిటీ రెసిడెన్సియల్ స్కూల్ హాస్టల్స్ పిల్లలకు మెనూ & క్యాస్మెటిక్స్ పెంచే కార్యక్రమ ప్రారంభోత్సవానికి రేకుర్తి బాలికల స్కూల్ 1 ప్రిన్సిపాల్ ఆహ్వానం మేరకు జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ చైర్మన్ మహమ్మద్ తాజోద్దీన్ విచ్చేసి స్కూల్ ని సందర్శించి వంట గది, స్టోర్ రూమ్, టాయిలెట్స్, బాత్ రూమ్స్, పరిశీలించారు. అనంతరం పిల్లలు చేసే వివిధ కార్యక్రమాలను తిలకించి పిల్లలతో కలసి మధ్యాహ్నం భోజనం చేసి మెనూ చాలా బాగుందని గతంలో ఎన్నడూ లేని విధంగా టిఫిన్స్, స్నాక్స్, ఇంటీ భోజనం కంటే చాలా బాగున్నాయని పిల్లల తల్లి తండ్రులు కూడా చెప్పడం చాలా సంతోషమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూట్రిషన్స్ సలహా మేరకు తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లకు మెనూ పెంచడం చాలా గొప్ప ఆలోచన అని ముఖ్యమంత్రికి తెలంగాణ ముస్లిమ్ మైనారిటీల పక్షాన కృతఙ్ఞతలు తెలుపుతున్నామన్నారు జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ చైర్మన్ మహమ్మద్ తాజోద్దీన్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ ఇంచార్జ్ పురమల్ల శ్రీనివాస్, కొత్తపల్లి మున్సిపల్ కమీషనర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు లయీక్ ఖాద్రి, జిల్లా ప్రధాన కార్యదర్శి నేహాల్ అహ్మద్, మైనారిటీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మహమ్మద్ కలిముద్దీన్, బాలబాద్రి శంకర్, మైనారిటీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ అజీం పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments