కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి మండలం దిందా గ్రామంలో అక్రమంగా టేకు చెట్లను కొట్టి యదేచ్చగా కలప దందా చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, లొకేషన్ మ్యాప్ ఈ రోజు అటవీ అధికారులకు పంపిస్తే ఆ స్థలానికి వెళ్లిన అధికారులు కలప దుంగలను చూసి వెనక్కి వచ్చినట్లు తెలిసింది. అటవీ అధికారులు తిరిగి వచ్చిన అనంతరం స్మగ్లర్లు ఆ దుంగలను తీసుకు వెళ్లినట్లు తెలిసింది. దీనిపై కర్జెల్లీ రేంజర్ ను సంప్రదించగా గూడెం సెక్షన్ ఆఫీసర్ వద్ద కలప దుంగలు ఉన్నట్లు చెప్పారు. కానీ కలప అక్రమ దందాలో అటవీ అధికారుల పాత్ర ఉన్నట్లు సర్వత్రా అనుమానాలు వ్యాపిస్తున్నాయి.