రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డీపేట మండలంలో గల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలుగా ఈ రోజు సారియా అంజామ్ పదవి బాధ్యతలు చేపట్టారు. ఇంతకు ముందు విధులు నిర్వహించిన ధర్మ నాయక్ ఉన్నత అధికారుల బదిలీ పై వెళ్లిపోయారు. సయ్యద్ సారియా అంజామ్ మెడికల్ ఆపిసర్ గా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు వైద్య సేవలను అందిస్తానని ఆమె పేర్కొన్నారు. నూతనంగా వచ్చిన వైద్యురాలుకు వైద్య సిబ్బంది సన్మానం చేసారు