Wednesday, October 21, 2026
spot_img
HomeTELANGANAసన్న వడ్ల బోనస్ కు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం

సన్న వడ్ల బోనస్ కు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గొల్లపల్లి బస్టాండ్ లో సన్నవడ్లకు బోనస్ ఇచ్చినందుకు శనివారం రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ రైతులకు సన్నవడ్లకు అదనంగా 500 రూపాయల బోనస్ రైతుల ఖాతాలలో పడటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఐకెపి సహకార సొసైటీ కేంద్రాలలో వడ్లకు గిట్టుబాటు ధర 2320 రావడంతో పాటు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ పడడంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అయిందని, రబీ పంట కోసం రైతులు దొడ్డు వడ్ల విత్తనాలు తెచ్చుకొని సాగుకు సన్నద్ధం కాగా సన్న వడ్లకు బోనస్ రావడంతో దొడ్డువడ్ల విత్తనాలను తిరిగి ఇచ్చివేసి సన్న వడ్ల విత్తనాలను తెచ్చుకుంటున్నట్లు రైతులు తెలిపారని రబీ సీజన్లో అత్యధికంగా సన్నవడ్లు పండించడానికి రైతులు సమయతమైనట్లు తెలిపారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తదనంతరం రైతుల పక్షపాతిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకున్నారని రైతు భరోసా కూడా డిసెంబర్ లో వేస్తామనడంతో రైతులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రైతులతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామ్ రెడ్డి, మాజీ సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ పందిర్ల సుధాకర్ గౌడ్, డైరెక్టర్లు కృష్ణారెడ్డి గంట చిన్న లక్ష్మి నారాయణరెడ్డి, తిరుపతి రెడ్డి, సూడిద రాజేందర్, శ్రీకాంత్ రెడ్డి, నాయకులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, చెన్ని బాబు, కొండాపురం శ్రీనివాస్ రెడ్డి, బండారి బాల్ రెడ్డి, పద్మా రెడ్డి, ఎలూరి రాజయ్య, రవీందర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, అంజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments