జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ ఫజలుల్ రహమాన్ తో పాటు ఆ గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పోలు బిక్షపతి, పోలు వెంకటేష్, రామన్నపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ గొర్నకొండ రాజు. ఈ రోజు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నివాసములో ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఫజలుల్ రహమాన్ మాట్లాతూ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. నాయకత్వంలో పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీకి పేరు ప్రతిష్టలు తీసుక వస్తామని, కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలు అప్పచెప్పిన సమర్థవంతంగా పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హమాలి వర్కర్స్ లేబర్ యూనియన్ అధ్యక్షుడు ఓల్లాల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ హుజురాబాద్ నియోజకవర్గ నాయకుడు మహమ్మద్ సలీంపాషా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారపల్లి శ్రీనివాస్, మేడి మహేందర్. తదితరులు పాల్గొన్నారు…