రాజన్న సిరిసిల్ల మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ముదిరాజు సోదరుడు భీమరి దేవయ్య (55) పది రోజుల క్రితం తాటి చెట్టు ఎక్కి ముంజలు కొట్టే క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి మరణించాడు. ఈ విషయం తిమ్మాపూర్ బిఆర్ఎస్ నాయకులు ఎల్లారెడ్డిపేట మండల జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావుకు తెలియజేయగానే వారం క్రితం పరామర్శించడమే కాకుండా ఈరోజు దినకర్మ కార్యక్రమం ఉండడం వలన 5000 రూపాయలు భీమరి దేవయ్య కుటుంబ సభ్యులకు పంపించి ఒక కార్యకర్త ఆపదలో ఉన్నాడని తెలియగానే నేనున్నానంటూ మా తిమ్మాపూర్ బిఆర్ఎస్ కుటుంబ సభ్యుడు అయినటువంటి భీమరిదేవయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి ఆదుకున్న ఎల్లారెడ్డిపేట మండలం జెడ్పిటిసి పెద్దల చీటీ లక్ష్మణరావుకి తిమ్మాపూర్ బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బొప్పాపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అందే సుభాష్, గుండ్ల రాజయ్య, గడ్డి సురేష్, దండు సాయి, బిమరి హనుమయ్య, కోలకాని శంకరయ్య