సిద్దిపేట టాస్క్ ఫోర్స్ మరియు చిన్నకోడూరు పోలీస్ ఆధ్వర్యంలో అక్రమంగా తరలిస్తున్న 3 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యం ( పిడిఎస్) బియ్యాన్ని పట్టుకున్న సిద్దిపేట టాస్క్ఫోర్స్ పోలీసులు, చిన్నకోడూర్ పోలీసులు. 09-03-2024శనివారం రాత్రి 10 గంటల సమయమున రామంచ మండలం చిన్నకోడూర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నర్సింలు ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని ఇబ్రహీం నగర్ గ్రామ శివారు నుండి అప్పి ఆటో AP23W-552లో అమ్మడానికి తరలిస్తున్నాడని అందిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, అధికారులు చిన్నకోడూరు పోలీసులు రైడ్ చేసి వాహనములో ఉన్న 3 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ ను పట్టుకొని చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. చిన్నకోడూర్ ఎస్ఐ బాలకృష్ణ పూర్తి విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు, చిన్నకోడూర్ ఎస్ఐ మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక పిడిఎస్ రైస్ అక్రమ రవాణా చేసిన నిల్వ ఉంచిన, చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూదం గ్యాంబ్లింగ్ చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై ప్రతిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామాలలో, పట్టణాలలో ఇసుక అక్రమ రవాణా చేసిన, పిడిఎస్ రైస్ అక్రమంగా దాచిపెట్టిన రవాణా గ్యాంబ్లింగ్, పేకాట, మరి ఏదైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100, టాస్క్ ఫోర్స్ అధికారుల నంబర్లు 8712667447, 8712667446, డయల్ 100 కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.