కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా బండి సంజయ్ కు టికెట్ కేటాయించడంతో భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేటలో బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్న బీజేపీ శ్రేణులు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు అత్యధిక మెజార్టీతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ కుమార్ ను గెలిపించుకుంటామని ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సందుపట్ల లక్ష్మారెడ్డి, మండల ఉపాధ్యక్షులు దాసరి గణేష్, కృష్ణ హరి, జిల్లా అధికార ప్రతినిధి బందారపు లక్ష్మారెడ్డి, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సాయి కిరణ్ నాయక్, బూత్ అధ్యక్షులు గాజుల దాసు, పారుపల్లి సంజీవరెడ్డి, బుర్కా వేణు, భాస్కర్ రెడ్డి, దీటి నరసయ్య, రాజు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.