అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, పార్టీ కార్యాలయం వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ, వైస్ ఎంపీపీ వీసం నానాజీ చేతుల మీదుగా పార్టీ జెండా ఎగరవేసి కేక్ కటింగ్ చేసి అందరికీ స్వీట్లు పంచారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14వ సంవత్సరంలో అడుగుపెడుతున్నామని పార్టీ కుటుంబ సభ్యుల నాయకులు, కార్యకర్తలతో అభిమానులు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించుకోవాలని, రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని రాష్ట్రంలో జగనన్న పాలన పేద ప్రజలందరికీ సంరక్షణ గా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ పొడగట్ల పాపారావు, ఉద్దండపురం సర్పంచ్ పొడగట్ల వెంకటేశ్వరరావు, వీసం రాజు, సీతంపాలెం ఎంపీటీసీ గొర్ల గోవిందరావు, ఎంపీపీ ఏనుగుపల్లి రత్నం, జడ్పిటిసి కాసులమ్మ, అల్లాడ కొండబాబు, అయినంపూడి మణిరాజు, తాతారావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
నక్కపల్లిలో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
RELATED ARTICLES