తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు అధికారికంగా గృహజ్యోతి, ఉచిత విద్యుత్ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్న సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక బస్టాండ్ లో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించడంలో భాగంగా నేటికీ నాలుగు గ్యారంటీలను అమలు చేశారని మరో రెండు పథకాలు అమలు చేసి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ బుగ్గ కృష్ణమూర్తి శర్మ, గ్రామ శాఖ అధ్యక్షులు గుడ్ల శ్రీనివాస్, ఎస్.కె సాహెబ్, గోగూరి శ్రీనివాస్ రెడ్డి, పందిర్ల సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొని మిఠాయిలు పంచి అభినందనలు తెలిపారు.