ఈ రోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పికెట్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మారేడ్పల్లి నివాసులైన కనకయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుటకు ఆర్థిక సోమత లేకపోవడంతో కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ ని సంప్రదించారు. వెంటనే స్పందించి రాష్ట్ర మరియు కంటోన్మెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ద్వారా బాధితుడికి శస్త్ర చికిత్స నిమిత్తం, రెండు లక్షల 50 వేలు(2,50,000) CMRF-LOC మంజూరు చేయించి LOC పత్రాలను కనకయ్య కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ అందించారు…