హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రాజెక్టు జనరల్ కన్సల్టెంట్ బిడ్ రేసులో ఐదు ఇంజనీరింగ్ కన్సార్షియం సంస్థలు నిలిచాయి. ప్రీ క్వాలిఫికేషన్ బిడ్‌లో ఈ సంస్థలు సమర్పించిన పత్రాలను పరిశీలించి, వాటికి ఫైనల్ బిడ్‌లో పాల్గొనే అర్హత ఉన్నట్టు నిర్ధారించామని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ (హెచ్‌ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. 1. ఏఈకామ్ ఇండియా+ఎజిస్ రైల్ (ఫ్రాన్స్)+ఈజీఐఎస్ ఇండియా అసోసియేట్స్, 2. ఆయేసా ఇంజనీరియా వై ఆర్కిటెక్చురా (స్పెయిన్)+ఆర్వీ అసోసియేట్స్+నిప్పాన్ కోయి (జపాన్); 3. కన్సల్టింగ్ ఇంజనీర్స్ గ్రూప్+కొరియా నేషనల్ రైల్వే (దక్షిణ కొరియా), 4.సిస్ట్రా (ఫ్రాన్స్)+ఆర్‌ఐటీఈఎ్‌స+డీబీ ఇంజనీరింగ్ అండ్ కన్సల్టింగ్ (జర్మనీ), 5.టెక్నికా వై ప్రొయిక్టోస్ (స్పెయిన్)+పీఐన్‌ఐ గ్రూప్ (స్విట్జర్లాండ్) సంస్థలను ఎంపిక చేశామని వివరించారు.