ఫైజాబాద్(ఆఫ్ఘానిస్థాన్): ఆఫ్ఘానిస్థాన్ దేశంలో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. ఆఫ్ఘానిస్థాన్ దేశంలోని ఫైజాబాద్ నగరానికి ఆగ్నేయంగా 100 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంప ప్రభావం రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. సోమవారం ఉదయం 6.47 గంటలకు ఫైజాబాద్ సమీపంలో 135 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది.
ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదు. సిరియా, టర్కీ భారీ భూకంపం తర్వాత ప్రపంచవ్యాప్తంగా భూమి కంపిస్తే చాలు ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. వేలాదిమందిని పొట్టనబెట్టుకున్న సిరియా, టర్కీ భూకంపం విషాద ఘటన మరవక ముందే మళ్లీ ఆఫ్ఘానిస్థాన్, భారత దేశాల్లో భూప్రకంపనలు సంభవించాయి.