Saturday, October 5, 2024
spot_img
HomeTELANGANAనేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

ఎల్లారెడ్డిపేట్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 26 సీసీ కెమెరాలను, పోలీస్ అధికారులు, సీసీ కెమెరాల దాతలతో కలసి ప్రారంభించిన జిల్లా ఎస్పీ.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట్ మండల కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన అశ్విని హస్పటిల్ యాజమాన్యం,డాక్టర్లు సత్యనారాయణ, అభినవ్ లను అభినందించిన జిల్లా ఎస్పీ. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చని, గ్రామాల్లో సీసీ కెమెరాలు మరింత భద్రత కల్పిస్తాయని, సీసీ కెమెరాల ద్వారా ఈ మధ్యకాలంలో చాలా కేసులు చేదించారు. తెలిపినారు. కేసుల ఛేదన సమయంలో సీసీ కెమెరాలు సాక్ష్యంగా ఉపయోగపడతాయని తెలిపారు గ్రామంలో రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణగా నిలుస్తాయని తెలిపినారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాలు లేని గ్రామస్తులు సీసీ కెమెరాలు ఏర్పాటు గురించి ముందుకు వచ్చి పోలీస్ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. పోలీస్ స్టేషన్ పరిధిలో మిగితా గ్రామాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు దాతలు ముందుకు రావాలని, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారా నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమని ఆయన చెప్పారు. ఎస్పీ వెంట సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ రమాకాంత్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments