హిందూపురం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీ సత్యసాయి జిల్లా డీసీసీ అధ్యక్షులు MH ఇనాయతుల్లా సమక్షంలో చిలమత్తూరు మోహన్ గాంధీ శ్రీ సత్య సాయి జిల్లా ఉపాధ్యక్షుడుగా, కదిరి నియోజకవర్గ బాధ్యడుగా నియామక పత్రం, బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భముగా చిలమత్తూరు మోహన్ గాంధీ మాట్లాడుతూ నాపై నమ్మకం వుంచి నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పిన పీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిళ రెడ్డి, సి డబ్ల్యూ సి సభ్యులు రఘువీరా రెడ్డి, మరియు సి డబ్ల్యు సి సభ్యులు గిడుగు రుద్రరాజు, డిసిసి అధ్యక్షులు ఇనాయతుల్లా, పీసీసీ ఉపాధ్యక్షులు కోటా సత్యం, మాజీ డిసిసి అధ్యక్షులు సుధాకర్, కదిరి సీనియర్ నాయకులు మాజీ టెంపుల్ చైర్మన్ నగిరి శ్రీ హరి ప్రసాద్ లకు ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాపై నమ్మకంతో కదిరి నియోజకవర్గ బాధ్యతలు కూడ అప్పజెప్పిన జిల్లా అధ్యక్షులు MH ఇనాయతుల్లా కు నా ప్రత్యేక ధన్యవాదములు మరియు నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను అన్నారు. నూతన కదిరి కాంగ్రెస్ కమిటీ సభ్యులకి, మండల సభ్యులకి, అందరికి అభినందనలు తెలియజేస్తూ, సమిష్టి కృష్టితో కదిరి నియోజకవర్గం లో కాంగ్రెస్ బలోపేతం కోసం కృషిచేద్దామని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రతి నాయకుడు కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు.
