తేదీ 24-03-2024 ఆదివారం ఉదయం 08.10 గంటలకు ముందు ఒక గుర్తుతెలియని పురుషుడు వయస్సు సుమారు 35-40 సంవత్సరాలు KM.No.271/10-14 పెద్దంపెట్- రామగుండం రైల్వే స్టేషన్ల మధ్య బహుశ ఎదో గుర్తు తెలియని రైలుబండి నుండి ప్రమాదవశాత్తు కిందపడుట వలన గాని లేదా ఏదైనా ఇతర కారణము వలనగాని చనిపోయి ఉండవచ్చునని. మృతుని వద్ద ఏలాంటి గుర్తింపు కార్డులు లేవని, మృతుడు నలుపు ప్యాంటు ఎరుపు హాఫ్ టీ షర్ట్ ధరించి ఉన్నాడని, శవాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ గోదావరిఖని మార్చురీ రూములో భద్రపరుచనైనదని, మృతునికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలిసినచో RHC 06 ROP రామగుండం ఫొన్ నంబర్లు 9949304574, 8712658604 కి తెలియపర్చగలరని రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి పేర్కొన్నారు