మహాశివరాత్రి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ఉన్న శివాలయంలో, శ్రీ రుక్మిణి వేణుగోపాల్ స్వామి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రుక్మిణి భామ వేణుగోపాల స్వామి గుడి చైర్మన్ గడ్డం జితేందర్, వైస్ చైర్మన్ గంట వెంకటేష్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, శామంతుల అనిల్, కట్టెల సాయికుమార్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు
