విజయవాడ,లబ్బీపేట: చంద్రబాబు నాయుడి 6 గ్యారింటిల పథకాలను స్థానిక టిడిపి నాయకులు దూరు రాజశేఖర్,జనసేనా నాయకులు బీసుపోగు తిరుమల రావు ఆధ్వర్యంలో తెదేపా 6 గ్యారంటి పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాజశేఖర్, తిరుమల రావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సైకో రాక్షస పాలన నుండి విముక్తి కలిగించి ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం ఆరు గ్యారంటి పథకాలను తీసుకోచ్చారని అన్నారు. వచ్చేది తెలుగు దేశం ప్రభుత్వం అని తమ ప్రభుత్వం వచ్చిన తరువాత చంద్రబాబు ఆరు గ్యారంటి పథకాలను అమలు చేస్తారని విశ్వాసం వెల్లబుచ్చారు. రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల కు నిలయంగా మార్చారని ఛీప్ లిక్కర్ తో ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. తూర్పులో గద్దే గెలుపు, రాష్ట్రంలో చంద్రబాబు, దేశంలో మోడీ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు.
19 వడివిజన్ లో గ్రీన్ లాండ్ వెనక 6 గ్యారంటిలపై అవగాహన కార్యక్రమం
RELATED ARTICLES

