Wednesday, September 16, 2026
spot_img
HomeTELANGANAహరిహర ట్రస్ట్ సహకారంతో దివ్యాంగులకు RTC బస్సు పాస్ ల పంపిణీ: హుజురాబాద్ డిపో మేనేజర్...

హరిహర ట్రస్ట్ సహకారంతో దివ్యాంగులకు RTC బస్సు పాస్ ల పంపిణీ: హుజురాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్

వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామంలోని హరిహర ట్రస్ట్ పోషక సమితి ఆధ్వర్యంలో శనివారం దివ్యాంగులకు బస్సు పాసుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హుజురాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ 55 మంది దివ్యాంగులకు బస్సు పాసులు, అరటి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులలో 50 శాతం సబ్సిడీతో రవాణా సౌకర్యాన్ని కల్పిస్తూ, ప్రతి ఏటా బస్సు పాసులను అందజేస్తామని, సురక్షితమైన రవాణా సౌకర్యం కోసం, ఆర్టీసీ బస్సులలో ప్రయాణించాలని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం సూపర్ లగ్జరీలలో లేదని, కావున సూపర్ లగ్జరీ బస్సులలో కూడా 50 శాతం సబ్సిడీతో ఆర్టీసీ బస్సులలో ప్రయాణించవచ్చునని, ఆర్టీసీ లాభాల బాట ప్రయాణించడానికి, ప్రజలందరూ ఆర్టీసీ బస్సులలో ప్రయాణించి మీ గమ్యాన్ని సురక్షితంగా చేరాలన్నారు.

దివ్యాంగులకు బస్సు పాస్ ల కోసం హుజురాబాద్ రావలసిన అవసరం లేకుండా, నర్సింగాపూర్ గ్రామంలో ఇవ్వడానికి ఏర్పాట్లు చేసిన, హరిహర ట్రస్ట్ సభ్యులకు, సర్వోత్తమరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం దివ్యాంగులు మాట్లాడుతూ దివ్యాంగులకు శ్రమ లేకుండా ఊర్లో బస్సు పాసులు అందజేయడానికి సహకరించిన హరిహర ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగులు మాట్లాడుతూ నర్సింగాపూర్ గ్రామంలో బస్సు పాసుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన డిపో మేనేజర్ రవీంద్రనాథ్ కి శాలువా కప్పి, ఘనంగా సన్మానించి, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ దివ్యాంగుల బస్సు పాసుల పంపిణీ కార్యక్రమంలో హుజురాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్, సూపర్వైజర్ సాయి చరణ్, ఐలయ్య, హరిహర ట్రస్ట్ సభ్యులు దేవేందర్ రెడ్డి, సర్వోత్తమరెడ్డి, శ్రీనివాస్, సమ్మయ్య, కొండల్ రెడ్డి, వికలాంగులు సమ్మయ్య, రాజు కుమార్, రాజిరెడ్డి, అంకుస్, తిరుపతి, శ్రీలత, రజిత, తదితరులు పాల్గొన్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments