సికింద్రాబాద్ బీ.ఆర్.ఎస్. పార్టీ యువ నేత తీగుల్ల రామేశ్వర్ గౌడ్ జన్మదిన వేడుకలు శనివారం సికింద్రాబాద్ లో ఘనంగా జరిగాయి. సితాఫలమండీ లోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ కుటుంబసభ్యులు, వేలాది మంది కార్యకర్తలు , అభిమానుల సమక్షంలో రామేశ్వర్ గౌడ్ తన జన్మ దిన వేడుకలను జరుపుకున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మెట్టుగూడ డివిజన్ లోని దూద్ బావి ప్రభుత్వ స్కూల్ విద్యార్ధులకు క్యారంబోర్డులు, క్రీడా సామాగ్రి కిట్లను రామేశ్వర్ గౌడ్ ఈ సందర్భంగా పంపిణీ చేశారు. అదే విధంగా వివిధ సేవ కార్యక్రమాలను ఆయన చేపట్టారు. కార్పొరేటర్ రాసురి సునీత రమేష్, హెడ్ మాస్టర్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.