పోలీసులు, మహిళల ప్రమేయంతో దక్కిన బడా నాయకుని ప్రాణాలు…?
పలువురికి బలమైన దెబ్బలు పోలీసుల రంగ ప్రవేశంతో దక్కిన ప్రాణాలు…??
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్ లో మంగళ వారం సాయంత్రం రెండు ప్రధాన పార్టీల మధ్య గొడువ జరిగింది. కర్రలతో దాడులు జరిగాయి. ఇరు వర్గాలకు చెందిన కొందరికి బలమైన దెబ్బలు తగిలినట్లు తెలిసింది. పోలీసుల రంగ ప్రవేశంతో ప్రాణాలు దక్కాయని గ్రామస్థులు వాపోయారు. పోలీసులు, మహిళలు కలిసి కట్టుగా ఒక బడా నాయకుణ్ణి రక్షించినట్లు సమాచారం. లేకుంటే ఆ నాయకునికి ప్రాణాపాయం జరిగి ఉండేది కావచ్చని స్థానికులు ముచ్చటించు కుంటున్నారు. ఆ నాయకునికి అనుచరుడుగా ఉండే ఓ వ్యక్తికి బలమైన దెబ్బలు తగిలినట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసులే లేకుంటే ఆ అనుచరుడు చనిపోయే వాడని, అంతటి గొడవ జరిగిందని తెలిసింది. పోలీసులు కూడా ప్రాణాలు పణంగా పెట్టి గొడవలో ఇరు వర్గాలను చెదర గొట్టారు. పోలీసులే లేకుంటే రక్త పాతం జరగడంతో పాటు ప్రాణాలు పోయే పరిస్తితి నెలకొందని విశ్వసనీయ సమాచారం. బుగ్గారం ఎస్సై సందీప్ అధ్వర్యంలో పలువురు పోలీస్ సిబ్బంది చాక చక్యంగా వ్యవహరించి, సమయ స్ఫూర్తితో గొడవను అడ్డుకున్నారు. ఈ తగాధాలో పోలీస్ సిబ్బంది కి కూడా దెబ్బలు తగిలినట్లు తెలుస్తోంది.