మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో సిరిసిల్ల నియోజకవర్గం నుండి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పిట్టల భూమేష్ ముదిరాజ్ తన అనుచరులతో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రేస్ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంగళవారం రోజు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా పిట్టల భూమేష్ ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయ పరిణామాల్లో బహుజన సమాజ్ పార్టీ ని వీడానని భారత రాజ్యాంగం మార్చేందుకు నరేంద్రమోడి తీవ్రమైన కుట్ర చేస్తున్నారని ఇకనైనా ఆకుట్రలను నియంత్రించాలనే ఆలోచనతో కాంగ్రేస్ పార్టీలో చేరాల్సి వచ్చిందని తెలిపారు. ఆయన వెంట సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షుడు లింగంపల్లి మధూకర్, ఎడ్ల రాజ్ కుమార్, జజ్జరి నర్సయ్య, గుడిసె రమేష్, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు రాణవేణి లక్ష్మణ్, ముదిరాజ్ తదితరులు కాంగ్రెస్ లో చేరారు.